ఐడియా ఆఫర్‌ : స్మార్ట్ ఫోన్లపై రూ.2వేల క్యాష్‌బ్యాక్‌

Idea-Cellularటెలికా ఆపరేటర్‌ ఐడియా  కొత్త  క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రటకించింది. అన్ని  4G ఫోన్లు  కొనుగోలు చేసిన వారికి 2వేల రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. శుక్రవారం (ఫిబ్రవరి-23) ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఐడియా ప్రకటించింది.

ఐడియా ప్రకటించిన  ఈ క్యాష్ బ్యాక్  ఆఫర్‌  ప్రీపెయిడ్ ,  పోస్ట్ పెయిడ్ యూజర్లకి వర్తిస్తుంది.  అయితే ప్రిపెయిడ్ యూజర్లు మొదటి 18 నెలలు ప్రతినెలా రూ.199..అంతకంటే ఎక్కువ రీఛార్జి చేయించుకోవాలి.  రూ.3వేలు రూపాయల విలువైన రీఛార్జ్‌లు చేసుకుంటే మొదటి దఫాగా  రూ. 750 క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. మరో 18 నెలల రీచార్జ్‌ తర్వాత   మరో  1,250 రూపాయల క్యాష్ బ్యాక్  కస్టమర్లకు  అందిస్తుంది.

పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు ..36 నెలల పాటు నిర్వహణ వాయిస్ కాంబో పథకాల కింద  రూ. 389  రీచార్జ్‌ ప్లాన్‌తో మొదలయ్యే  ప్లాన్లపై ఆఫర్ ఏప్రిల్ 30, 2018 వరకు అందుబాటులో ఉంటుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates