ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

దేశంలోని 5 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 2013 భూసేకరణ చట్టాన్ని నీరుగార్చే విధంగా తమిళనాడు,తెలంగాణ,ఏపీ,గుజరాత్,జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన జస్టిస్ మదన్ బి లోకూర్,దీపక్ గుప్తాల బెంచ్ ఐదు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

భూ నిర్వాసితులకు ఉపాధి, భద్రత కల్పించకుండా, రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలు చేయడంపై పిటిషన్ లో ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. సామాజిక ప్రభావ మదింపు అంచనా వేయకుండా  భూసేకరణ జరపడం కేంద్ర చట్టానికి విరుద్ధమని మేధా పాట్కర్ అన్నారు. కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఆర్డినెన్సు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్న ఆమె.. రైతులు, భూ యజమానుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా భూసేకరణ చట్టానికి సవరణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. జీవనోపాధి అనే ప్రాథమిక హక్కును హరిస్తున్నారని మేధా పాట్కర్ తన పిటిషన్ లో చెప్పారు. పిటిషనర్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.

Posted in Uncategorized

Latest Updates