ఐదు రోజుల చిన్నారితో భర్త అంత్యక్రియలకు

MUKUDవిమానం కూలిన ప్రమాదంలో మృతి చెందిన తన భర్త అంత్యక్రియలకు తన ఐదు రోజుల చిన్నారిని ఎత్తుకొని వచ్చి విధుల్లో పాల్గొంది ఆర్మీ మహిళా అధికారి. బిడ్డను ఎత్తుకొని ఆమె మార్చ్‌లో పాల్గొని.. తన భర్తకు నివాళులర్పించారు.

అసోంలోని మాజులీ ఐస్ ల్యాండ్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక హెలీకాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్మీ మహిళా అధికారి కుముద్ డోగ్రా భర్త… వింగ్ కమాడంర్ డి.వాట్స్‌ మరణించాడు. విమానాన్ని ల్యాండ్‌ చేసే సమయంలో అది అదుపు తప్పి ఒక్కసారిగా కూలిపోయి మంటలు రావడంతో అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో విమానాన్ని ల్యాండ్‌ చేసే సమయంలో అది అదుపు తప్పి ఒక్కసారిగా కూలిపోయి మంటలు రావడంతో అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం డి.వాట్స్‌ కు అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడికి ఆయన భార్య కుముద్ ఆర్మీ యూనిఫాంలో తన ఐదురోజుల కుమార్తెను ఎత్తుకొని వచ్చారు. మార్చ్‌లో పాల్గొన్నారు. భర్త మరణాన్ని దిగమింగుకొని భర్తకు నివాళులర్పించారు.

బిడ్డను ఎత్తుకొని వెళ్తున్న ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు మేజర్‌ డోగ్రాకు సెల్యూట్‌ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates