ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలో భారత్ : అరుణ్ జైట్లీ

రానున్న రోజుల్లో  భారత్.. ప్రపంచంలో  ఐదో పెద్ద  ఆర్థిక వ్యవస్థగా  ఆవిర్భవిస్తుందన్నారు  కేంద్ర ఆర్థిక  మంత్రి  అరుణ్ జైట్లీ. నాబార్డ్  వ్యవస్తాపక  దినోత్సవం సందర్భంగా  వీడియో కాన్ఫరెన్స్  ద్వారా మాట్లాడిన జైట్లీ… వరల్డ్ బ్యాంక్ బుధవారం(జులై-11) విడుదల  చేసిన  డేటా  ప్రకారం  ఫ్రాన్స్ ను  వెనక్కి నెట్టి  2.897 ట్రిలియన్  డాలర్ల  GDPతో  భారత్ ప్రపంచంలోనే  ఆరో  అతిపెద్ద  ఆర్థిక వ్యవస్థగా  నిలిచిందన్నారు. జీడీపీలో అమెరికా మొదటిస్ధానంలో ఉండగా, చైనా రెండో స్ధానంలో ఉన్నాయి. మూడవ స్ధానంలో జపాన్, నాల్గవ స్ధానంలో జర్మనీ, ఐదవ స్ధానంలో యునైటెడ్ కింగ్ డమ్ లు నిలిచాయి. త్వరలోనే  బ్రిటన్ ను  వెనక్కి నెట్టి  భారత్ ఐదో  స్థానానికి  ఎగబాకుతుందని  జైట్లీ విశ్వాసం  వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates