ఐఫోన్ కంటే ధర ఎక్కువ..

కాస్ట్లీ ఫోన్ ఏదీ అంటే.. ఠక్కున ఐఫోన్ అనేస్తాం. ఇప్పుడు ఆ ప్లేస్ ను LG తీసుకుంది. సిగ్నేచర్ ఎడిషన్ పేరుతో విడుదల విడుదల చేసింది. దీని ధర లక్షా 22వేల రూపాయలు. గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ ఫోన్.. ఆగస్ట్ 13వ తేదీ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ కంటే.. నాణ్యతలో బెస్ట్ అని చెబుతోంది ఎల్జీ కంపెనీ. బ్లాక్, వైట్ కలర్స్ లో మాత్రమే ఉన్నాయి. ఈ ఫోన్ వెనక భాగంలో మన పేరు రాసుకోవచ్చు. గీతలు పడవు అని గ్యారెంటీ ఇస్తోంది కంపెనీ.

ఫీచర్స్ ఇలా ఉన్నాయి :

డిస్ ప్లే : 6 ఇంచ్ క్వాడ్ HD ఓలెడ్, రిజల్యూషన్ : 2880 x 1440 పిక్సల్స్‌ స్క్రీన్‌, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌, 6 GB ర్యామ్‌, 256 GB స్టోరేజ్‌, 2 TB ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌,  డస్ట్‌ రెసిస్టెన్స్‌, 3D సౌండ్‌, 4G VOLTE, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్విక్‌ చార్జ్‌ 3.0, వైర్‌ లెస్‌ చార్జింగ్‌.

Posted in Uncategorized

Latest Updates