ఐబీఎం దావా: మైక్రోసాఫ్ట్ ఆఫీసర్ నిబంధన ఉల్లంఘించింది

Lindsay-Rae-McIntyre-Microsoft-Chief-Diversity-Officerసాష్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ కొత్త చీఫ్‌ డైవర్సిటీ ఆఫీసర్‌ లిండ్సే రే మెక్ఇంటైర్‌ పై మరో ప్రసిధ్ధ ఐటీ దిగ్గజం ఐబీఎం దావా వేసింది. వన్‌-ఇయర్‌ నాన్‌-కంపిటీటివ్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై ఐబీఎం ఈ దావా దాఖలు చేసింది. ఐబీఎంలో హెచ్‌ఆర్‌ అధినేతగా గతంలో పనిచేసిన లిండ్సే-రే ఐబీఎం నుంచి అకస్మాత్తుగా రాజీనామా చేసి, ఆమె తమ ఏడాది ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐబీఎం తెలిపింది. కంపెనీకి సంబంధించి ఎంతో కీలకమైన, రహస్య సమాచారం ఆమె దగ్గర ఉందని ఐబీఎం తెలిపింది. ఐబీఎం డైవర్సిటీ స్ట్రాటజీస్‌, హైరింగ్‌ టార్గెట్స్‌, టెక్నాలజీస్‌, ఇన్నోవేషన్స్‌ సమాచారమంతా ఆమె దగ్గర ఉందని న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో దాఖలు చేసిన దావాలో కంపెనీ తెలిపింది. తాత్కాలికంగా లిండ్సేను మైక్రోసాఫ్ట్‌కు వెళ్లకుండా జడ్జి నిషేధం విధించారు. అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్‌ ఇంకా స్పందించలేదు.అయితే లిండ్సే దగ్గర ఉన్న ట్రేడ్‌ సీక్రెట్లు మైక్రోసాఫ్ట్‌కు అంత అవసరమైనవి కావని, తన కొత్త బాధ్యతల్లో వీటిని ఉపయోగించే అవకాశం లేదని ఆమె లాయర్లు కోర్టుకి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates