ఐమాక్స్ లో మార్నింగ్ షో రద్దు.. ప్రేక్షకుల గొడవ

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సిటీలోని ఐమాక్స్ థియేటర్‌లో మార్నింగ్ షోను రద్దు చేశారు. దీంతో మార్నింగ్ షో చూడటానికి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకొని ఐమాక్స్ కు వచ్చిన వారు విషయం తెలుసుకుని థియేటర్ ముందు గొడవకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా షోను ఎలా రద్దు చేస్తారంటూ అక్కడి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిటీలోని మరికొన్ని థియేటర్లలో కూడా  పోలింగ్ సందర్భంగా మార్నింగ్ షోలను క్యాన్సిల్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates