ఐర్లండ్ ను చిత్తు చేసిన టీమిండియా : వందో టీ-20 మ్యాచ్ లో భారీ విజయం

match
పసికూన ఐర్లాండ్ కు పంచ్ పడింది. తొలి టీ-20లో తిరుగులేని విజయం సాధించింది భారత్. ఐర్లాండ్ పై 76 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ 208 రన్స్ చేసిన కోహ్లీ గ్యాంగ్.. ఐర్లాండ్ ను కేవలం 132 రన్స్ కే కుప్పకూలించింది. బుధవారం (జూన్-27) డబ్లిన్ లో జరిగిన మ్యాచ్ లో.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్…ఐదు వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది.  రోహిత్ 97, ధావన్ 74 రన్స్ చేశారు. ఓపెనర్లు రాణించినా…మిగతా బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ 4, చాహల్ 3, బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. రెండు టీ20 మ్యాచ్‌ ల సిరీస్‌ లో భాగంగా భారత్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 జూన్ 29న (శుక్రవారం) జరుగుతుంది.

Posted in Uncategorized

Latest Updates