ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా రెడీ : కోహ్లీ

kohliఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు రెడీ అయ్యింది టీమిండియా. ఐర్లాండ్ లో రెండు టీ-20లు ఆడిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్ తో మూడు టీ-20, మూడు వన్డే, 5 టెస్ట్ మ్యాచ్ ల్లో తలపడనుంది కోహ్లీ టీం. తాను వంద శాతం ఫిట్ గా ఉన్నానన్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. క్రికెట్ టీమ్ గేమ్ అని… తాను ఒక్కడిని ఎలా ఆడాననేది ప్రధానం కాదన్నాడు. అందరూ కలిసి ఆడితేనే… టీమ్ గా విజయాలు సాధిస్తామన్నాడు కోహ్లీ. ఇంగ్లండ్ లో స్వింగ్ అన్ని జట్లకు సమస్యేనన్నాడు. ఈ ఏడాది మెదట్లో తాము సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ లో భాగంగా మెదటి రెండు టెస్టులు ఓడిపోయామని అప్పుడు అందరూ భారత్ పనైపోయిందని భావించారని, అయితే ఆ తర్వాత మూడో టెస్ట్ గెలిచామని, అంతేకాకుండా దాని తర్వాత రెండు సిరీస్ లను గెల్చామని అప్పుడు మేము అద్భుతంగా ఆడుతున్నామని అందరూ రియలైజ్ అయ్యారని కోహ్లీ తెలిపారు. ఢిఫికల్ట్ క్రికెట్ ను ఆడే విషయంలో తాము ముందుకెళ్తున్నామని కోహ్లీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates