ఐష్ తో కలిసి నటించాలని ఉంది: విల్ స్మిత్

సినీ నటి ,అందాలరాశి ఐశ్వర్య రాయ్‌తో కలిసి నటించాలని ఉందన్నాడు ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి విల్‌స్మిత్‌, బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ హాజరయ్యారు. చనిపోయేలోపు జీవితంలో సాధించాలనుకునేవి జాబితాలో ఓ బాలీవుడ్‌ పాటలో నటించాలని ఉందన్నాడు. పదిహేనేళ్ల క్రితం ఐశ్వర్య రాయ్‌ను కలిశానన్నాడు. మేం కలిసినప్పుడల్లా ఏదైనా సినిమాలో నటించే విషయం గురించి ఎక్కువగా చర్చించుకునేవాళ్లమన్నాడు. అయితే అది జరగలేదు. ఎప్పటికైనా ఆమెతో కలిసి తప్పకుండా నటిస్తానన్నాడు. నా కెరీర్‌లో బాక్సింగ్‌ ఛాంపియన్‌ మహమ్మద్‌ అలీ బయోపిక్‌లో నటించడాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని… ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసిందన్నాడు విల్ స్మిత్. కార్యక్రమం పూర్తవుతున్న సమయంలో ఫర్హాన్‌..విల్‌స్మిత్‌ తో భాంగ్రా డ్యాన్స్‌ చేయించారు. ఇద్దరూ కుర్చీలో కూర్చుని డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఫర్హాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates