ఐసీఐసీఐ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి నియామకం

Icici  ఐసీఐసీఐ బ్యాంక్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎం.కే శర్మ పదవీకాలం రేపటితో ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్‌ అధికారి గిరీశ్‌ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.  ‘నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా గిరీశ్‌ చంద్ర చతుర్వేది నియామకానికి బోర్డు అంగీకరించింది’ అని ఐసీఐసీఐ బ్యాంక్ వేల్లడించింది. 1977 బ్యాంచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విమరణ చేశారు.

ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న శర్మ పదవికాలం జూన్‌ 30తో ముగియనుంది. ఛైర్మన్‌గా శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో కొత్త ఛైర్మన్‌ కోసం బ్యాంకు అన్వేషణ భాగంగా తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఎం.డి. మాల్యా పేరు ప్రస్తావనకు వచ్చింది. అయినప్పటికి సీనియర్ ఐఏఎస్ అధికారి చతుర్వేది నియామకానికే బోర్డు మొగ్గుచూపింది.

Posted in Uncategorized

Latest Updates