ఐసీసీ ర్యాంకింగ్స్ : కోహ్లీనే నంబర్ 1

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ర్యాంకింగ్ ను పదిలంగా ఉంచుకుంటున్నాడు. గురువారం  ప్రకటించిన ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ నంబర్ 1 స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ కోహ్లీనే టాప్ ప్లేస్ లో ఉండగా..ఇవాళ్టి ర్యాంకింగ్స్ లోనూ కోహ్లీనే నంబర్-1గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడంతో.. కోహ్లీ ఖాతాలో 14 పాయింట్లు  చేరాయి. మొత్తం 934 పాయింట్లతో లీడ్ లో ఉన్నాడు.

కోహ్లీ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 915 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. టాప్ 20 లో భారత్ తరపున.. చటేశ్వర పుజార 4,  రహానే 15వ స్థానంలో కొనసాగుతున్నారు. బౌలింగ్ లో రవీంద్ర జడేజా 5,  రవిచంద్రన్‌ అశ్విన్ 6వ స్థానంలో నిలిచారు.

Posted in Uncategorized

Latest Updates