ఐ డోంట్‌ నో అంటున్న మహేష్

Mahesh Babu in Bharath Ane nenuసూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా భరత్‌ అనే నేను. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల స్పీడు పెంచారు యూనిట్‌. ఇప్పటికే టైటిల్‌ సాంగ్‌ ను రిలీజ్ చేసిన టీమ్ ఆదివారం (ఏప్రిల్-1) ఉదయం ఐ డోంట్‌ నో అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ను బాలీవుడ్ స్టార్‌ ఫర్హాన్‌ అక్తర్‌ పాడగా.. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించారు. మహేష్ బాబు సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్‌, ప్రకాష్ రాజ్‌, పోసాని కృష్ణమురళీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సీఎం గా కనిపిస్తున్నాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్ ఇచ్చిన మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భరత్‌ అనే నేనుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Posted in Uncategorized

Latest Updates