ఒకే టెస్ట్ లో 11 క్యాచ్ లు.. వరల్డ్ రికార్డ్ సమం చేసిన రిషబ్ పంత్

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరల్డ్ రికార్డ్ సమం చేశాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ 11 క్యాచ్ లు పట్టి ఈ ఘనత సాధించాడు.  భారత్ తరపున అత్యధిక క్యాచ్ లు పట్టిన తొలి వికెట్ కీపర్ గా న్యూ రికార్డ్  క్రియేట్ చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్లు జాక్‌ రస్సెల్‌(11 క్యాచ్ లు,ఇంగ్లాండ్‌), ఏబీ డివిలియర్స్‌( 11 క్యాచ్ లు, దక్షిణాఫ్రికా) సరసన పంత్‌ రీసెంట్ గా చేరాడు.

మరోవైపు అడిలైడ్‌ టెస్ట్ లో అత్యధిక క్యాచ్‌లు నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తం 35 క్యాచ్‌లు నమోదయ్యాయి. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇన్ని క్యాచ్‌లు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైం. గతంలో దక్షిణాఫ్రికా,ఆసీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 34 క్యాచ్‌లు నమోదయ్యాయి.

 

Posted in Uncategorized

Latest Updates