ఒక్కరైనా మోడీకి ఐ లవ్ యూ చెప్పారా

hqdefaultవాలంటైన్స్ డే సందర్భంగా ప్రధాని మోడీకి ఓ వింత ప్రశ్న ఎదురైంది. మోడీని ఉద్దేశించి గుజరాత్ MLA జిగ్నేష్ మేవానీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. నాకు చాలా మంది ఐ లవ్ యు చెప్పారు. కానీ మోడీకి ఎప్పుడైనా ఎవరైనా ఐ లవ్ యు చెప్పారా లేదా అన్నది నా డౌట్. హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ మేవానీ ట్వీట్ చేశారు. అంతే కాకుండా మళయాల నటి ప్రియా ప్రకాశ్ వైరల్ సాంగ్‌పైనా ట్వీట్ చేస్తూ..  ఆ వీడియో క్లిప్ ను ఆరెస్సెస్‌కు లింకు పెట్టారు. ఆరెస్సెస్ నిరసనల కంటే ప్రజలు ఈ సాంగ్‌నే ఎక్కువగా ఇష్టపడ్డారని, దీనిని బట్టి ఇండియన్స్‌కు ద్వేషం కంటే ప్రేమే ఎక్కువని మరోసారి నిరూపితమైందని మేవానీ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates