ఒక్కరోజులోనే రూ.1100 పెరిగిన వెండి

కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతూ రూ. 38వేల మార్క్‌ కు పడిపోయిన వెండి ధర ఇవాళ(సెప్టెంబర్-29) ఒక్కసారిగా భారీగా పెరిగింది. గురు, శుక్ర వారాల్లో వరుసగా రూ. 300, రూ. 450 తగ్గిన వెండి ధర ఇవాళ ఒక్కరోజే రూ.1100 పెరిగింది. దీంతో వెండి ధర రూ.39వేల మార్క్‌ ను చేరుకుంది.

మరోవైపు గత మూడు రోజుల్లో  రూ. 425 తగ్గిన బంగారం ధర ఇవాళ రూ.250 పెరిగింది.  శనివారం నాటి మార్కెట్లో  10 గ్రాముల బంగారం ధర రూ. 31,500కు చేరింది. అంతర్జాతీయంగానూ బంగారం 0.83శాతం, వెండి 2.85శాతం పెరిగింది.

Posted in Uncategorized

Latest Updates