ఒక్కరోజు దీక్ష చేపట్టిన చంద్రబాబు

BABUఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందే అనే నినాదంతో ధర్మ పోరాట దీక్ష పేరుతో దీక్ష చేస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్-20) ఆయన 68వ పుట్టిన రోజు సందర్భంగా… విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా దీక్షకు దిగారు. దీక్షకు ఏపీ నుంచి భారీగా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. మంత్రులు కూడా దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాసంఘాల నేతలు దీక్షా స్థలికి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates