ఒక్కసారి ఆఫీస్ కి వస్తే చాలు : జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం

KCYరాష్ట్రంలో జూన్ నెల నుంచి ధరణి వెబ్ సైట్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు సీఎం కేసీఆర్. రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలు, ధరణి వెబ్ సైట్ రూపకల్పనపై ప్రగతి భవన్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. మొదట విడతగా ఐదు మండలాల్లో, రెండో విడతలో 30 మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద రిజిస్ట్రేషన్లు, వెబ్ సైట్ నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ లో వచ్చిన అనుభవాల ఆధారంగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా కొత్త రిజిస్ట్రేషన్ల విధానం, ధరణి వెబ్ సైట్ నిర్వహణ ఉండాలని చెప్పారు. కొత్త  రిజిస్ట్రేషన్ విధానం ద్వారా భూములు అమ్ముకున్నవారు, కొన్నవారు ఒకే ఒకసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే సరిపోతుంది. పాస్‌బుక్కులు, రిజిస్ట్రేషన్ పేపర్స్ కొరియర్లో నేరుగా వాళ్ల ఇంటికి పంపుతారు. ఈ కొత్త విధానంతో ఎవరూ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, అవినీతికి కూడా అవకాశం ఉండదని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates