ఒక్కోరైతుకి రూ.5లక్షల బీమా: సీఎం కేసీఆర్

kcr-farmersఎట్టి పరిస్థితుల్లోనూ కౌలు రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించబోమన్నారు సీఎం కేసీఆర్. కౌలు రౌతు పర్మినెంట్‌ కాదని, పెట్టుబడి ఇచ్చిన తర్వాత 96 శాతం మంది రైతులు వాళ్ల భూములు వాళ్లే చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని, టెనన్సీ యాక్ట్‌ ప్రకారం కౌలు రుతులకు రుణం ఇవ్వడం కష్టమన్నారు. కరీంనగర్‌లో సోమవారం(ఫిబ్రవరి-26) జరుగుతున్న రైతు సమన్వయ సమితి సదస్సులో పెట్టుబడిసాయాన్ని కౌలు రైతులకు ఇవ్వకపోవడానికి కారణాలను తెలిపారు సీఎం కేసీఆర్ .

పామాయిల్‌ రైతులకు కూడా పంట పెట్టుబడి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. సమన్వయ సమితి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. రైతులకు అనారోగ్యం వచ్చినా.. అకాలమరణం పొందినా రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్.

రైతులకు 75 శాతం సబ్సిడీతో టార్పాలిన్‌లు అందజేస్తామన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌. వరి నాట్ల యంత్రాలకు సబ్సిడీ అందజేస్తామన్నారు పోచారం.

Posted in Uncategorized

Latest Updates