ఒక్క ఓవర్ లో 6 సిక్సులు..12 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ

షార్జా : మన దేశంలో మొదలైన IPLకి క్రేజ్ పెరగడంతో..ఇప్పుడు ఈ లీగ్ లు పలు దేశాల్లోనూ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బిగ్ బాష్, BPL, CPL, లాంటి లీగ్స్ ఉండగా..ఈ సారి అఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL) ప్రారంభమయ్యింది. షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్-14)న జరిగిన  ఈ పొట్టి ఫార్మాట్ లో అఫ్గాన్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ రెచ్చిపోయాడు.

ఒక్క ఓవర్ లోనే 6 సిక్సర్లు బాది..ఓ వైడ్ తో సహా 37 రన్స్ సాధించి లీగ్ లో రికార్డు సాధించాడు. 12 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బాలక్ లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 244 రన్స్ చేసింది. బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన కాబుల్ జ్వానన్ టీమ్ ఓపెనర్.. హజ్రతుల్లా జజాయ్ (17 బాల్స్ లో..62రన్స్ )తో ఈ ఘనత సాధించాడు. 5.5 ఓవర్ లో నబీ బౌలింగ్ లో హజ్రతుల్లా జజాయ్(62) ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. ఈ మ్యాచ్ లో చివరివరకు పోరాడిన కాబుల్ జ్వానన్ టీమ్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 223 రన్స్ చేసి ఓటమి పాలైంది.

Posted in Uncategorized

Latest Updates