ఒక్క ఫోన్ కాల్… ఇరగదీస్తారు : స్టేషన్ ఇంచార్జ్ లుగా 8 మంది మహిళలు

copమహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముంబై పోలీసులు. ఎనిమిది మంది మహిళా పోలీసులను స్టేషన్‌ ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్లు ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ఏమూల నుంచి అయినా ప్రమాదంలో ఉన్నామని మహిళలు కంఫ్లెయింట్ చేసిన వెంటనే ఈ టీం స్పందించి వారి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తుంది. దేశంలో మహిళా ఇన్‌చార్జ్‌లను నియమించిన మొదటి సిటీగా ముంబై పోలీసులు ఘనత సాధించారు. ప్రతి రోజూ చిరునవ్వుతో మంచిని కాపాడటం, చెడును నాశనం చేయడం కోసం ఈ టీం పనిచేస్తుందని తమ ట్వీట్ లో ముంబై పోలీసులు తెలిపారు. మహిళా సాధికారతకు ఇది మంచి పరిణామమని ముంబై పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates