ఒక్క రోజులోనే : రికార్డు స్ధాయికి శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల శ్రీవారికి రికార్డు స్ధాయిలో హుండీ ఆదాయం వచ్చింది. గురువారం(జులై-26) ఒక్కరోజే అత్యధికంగా రూ.6.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఆలయ చరిత్రలోనే ఇంత అధిక మొత్తంలో హుండీ ఆదాయం రావడం ఇదే మొదటిసారి. 2012, ఏప్రిల్-2(శ్రీరామనవమి)న  రూ.5.73 కోట్ల హుండీ ఆదాయం రాగా, నోట్ల రద్దు తర్వాత 2017 మార్చి 28 న రూ.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే గురువారం వచ్చిన హుండీ ఆదాయమే ఇప్పటివరకూ ఎక్కువని టీటీడీ తెలిపింది. గత పదేళ్లుగా స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకూ పెరుగుతూ వస్తోందని టీటీడీ తెలిపింది. అజ్ఞాత భక్తులు పెద్ద మొత్తంలో స్వామివారి హుండీలో నిధులు సమర్పించిన సమయంలో కూడా 2 నుంచి 3 కోట్లు దాటని హుండీ ఆదాయం… గురువారం ఒక్కరోజే రికార్డు స్ధాయిలో ఆదాయం రావడం విశేషం.

Posted in Uncategorized

Latest Updates