ఒక్క రోజు సైకిల్ పై వద్దాం : ఆచరించిన IAS ఆఫీసర్.. మిగతా వాళ్లకు ఆదర్శం

ias-officerఐఏఎస్ అధికారి అనగానే ఆయన వాహనానికి ముందు, వెనుక కాన్వాయి ఉంటుంది. ఎక్కడి వెళ్లినా పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఓ IAS అధికారి మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా సైకిల్ పై ఆఫీసుకు వచ్చారు. అలా రోజు రావడం కుదరని..వారంలో ఒక సారి మాత్రం కచ్చితంగా వస్తానంటున్నారు ఆ అధికారి. దీనికి కారణం పర్యావరణ పరిరక్షణే కారణమంటున్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

2014 IAS బ్యాచ్ కు చెందిన ముషారఫ్ అలీఫారుఖీ  GHMC లో ఐటీ విభాగంలో అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మెహిదీపట్నంలోని తన నివాసం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న GHMC ప్రధాన కార్యాలయానికి సైకిల్ పై వచ్చారు. వెహికిల్ లో అయితే ఆఫీసుకు రావడానికి 20 నిమిషాలు పడుతుందని…అదే సైకిల్ పై తను 25 నిమిషాల్లో చేరుకున్నట్లు తెలిపారు. వారంలో చాలా మంది ఐదురోజులు మాత్రమే పని చేస్తారని…ఆఫీసులు దగ్గరలో ఉన్న వాళ్లు వారంలో ఒక సారి సైకిల్ పై ఆఫీసులకు చేరుకుంటే…ట్రాఫిక్ తగ్గడంతో పాటు కాలుష్యాన్ని 20 శాతం తగ్గించవచ్చన్నారు ఐఏఎస్ అధికారి ముషారఫ్. ఈ క్రమంలోనే ఆసక్తి చూపించే వారి కోసం సైకిళ్లను సమకూర్చేందుకు హైదరాబాద్  బై సైకిల్ క్లబ్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఐటీ కారిడార్ లోని పలు సంస్థల ఉద్యోగులు సైకిల్ పై సవారీలు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates