ఒక్క సినిమాతోనే గుర్తింపు : జాన్వీకి అరుదైన గౌరవం

శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీకపూర్.. చక్కటి పర్మామెన్స్ తో అలరించింది. ధడక్ సినిమాతో ఫ్యాన్స్ పాలోయింగ్ పెంచుకున్న జాన్వీ.. అలనాటి అందాల తార శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తూ..తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఎంట్రీతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీకపూర్ ను అరుదైన గౌరవం వరించింది. రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు జాన్వీకపూర్ సెలక్ట్ అయ్యింది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును జాన్వీకపూర్‌ కు మంగళవారం డిసెంబర్-11న ప్రదానం చేయనుంది.

ఈ సందర్భంగా జాన్వీకపూర్ మాట్లాడుతూ..’ఈ ఏడాది ధడక్ తో సీనీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చా. నార్వేలో ఉన్నవారితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూశారు. నార్వే ప్రజలు సోషల్‌ మీడియా ద్వారా ధడక్ కి ప్రశంసలు, ఆశీస్సులు అందించారు. ఇలాంటి అరుదైన గుర్తింపు రావడం ఆశ్చర్యంగా, గొప్ప అనుభూతిని కలిగించేలా ఉంది. రైజింగ్ ఆఫ్ ది ఇయర్ టాలెంట్ అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సంతోషకర క్షణాలను అభిమానులతో పంచుకుంది జాన్వీకపూర్.

Posted in Uncategorized

Latest Updates