ఒక కుటుంబానికి ఒకే టికెట్: కాంగ్రెస్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16 కల్లా మొత్తం పూర్తిస్థాయి జాబితాను ప్రకటించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ పట్ల విధేయత, గెలిచే సత్తా ఉన్న నేతలనే పోటీకి దింపాలని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ(PEC) నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులతో లిస్టును PEC రూపొందిస్తోంది. తర్వాత ఈ జాబితాను ముగ్గురు సభ్యుల స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. పరిశీలన తర్వాత ఈ లిస్టునుంచి తుది అభ్యర్థిని ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఎంపిక చేస్తుంది.

 

Posted in Uncategorized

Latest Updates