ఒక రోజు బ్రిటిష్ హైక‌మిష‌న‌ర్‌గా భార‌త విద్యార్థిని

ఓ భారతీయ విద్యార్థిని ఒక్క రోజు బ్రిటిష్ హై కమిషనర్ గా ప‌నిచేసి అరుదైన గుర్తింపు పొందింది. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని(అక్టోబర్‌-11) పురస్కరించుకొని బ్రిటిష్ హై కమిషన్ 18-23 ఏళ్ల అమ్మాయిలకు ఓ పోటీని నిర్వహించింది. ఈ పోటీలో నోయిడా వర్శిటీ విద్యార్థిని ఈషా బహల్ గెలుపొందింది. దీంతో ఒక్క రోజు భార‌త్ లో బ్రిటిష్ హైక‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసింది. ఇదొక‌ అరుదైన అనుభూతి అని.. ఇంగ్లండ్‌, భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగానని ఈషా సంతోషం వ్య‌క్తం చేసింది. లింగ సమానత్వానికి అర్థం ఏమిటో వీడియో రూపంలో చెప్పాల‌ని కోరుతూ బ్రిటీష్ హై కమిషన్ పోటీ నిర్వహించింది.

Posted in Uncategorized

Latest Updates