స్మార్ట్‌ ఫోన్‌ వాడకుంటే రూ.72 లక్షలు మీవే

స్మార్ట్‌‌‌‌ఫోన్‌ను క్షణమైనా విడిచి ఉండలేని రోజులొచ్చాయి. పని ఉన్నా లేకపోయినా ఫోన్‌ లోకి చూస్తూ, నొక్కుతూ కనిపించేవారే ఎక్కువ. బయటి ప్రపంచాన్ని మర్చిపోయి మరీ బతుకుతున్నారు. దీన్ని మార్చాలనుకుంటోంది కొకోకోలాకు చెందిన ‘విటమిన్‌ వాటర్‌ ’ అనే సంస్థ. స్మార్ట్‌‌‌‌ఫోన్‌ లేకుండా ఏడాది పాటు గడపగలిగే సత్తా మీలో ఉందా అంటూ సవాల్‌ విసిరింది. పోటీలో నెగ్గిన వారికి రూ.72 లక్షలు(లక్ష డాలర్లు) బంపర్‌ ప్రైజ్‌ ఇస్తానంటోంది.

కాంపి టీషన్‌ లో పోటీ పడే వారికి 1990ల్లో తయారు చేసిన బేసిక్‌ ఫోన్‌ ను కంపెనీయే ఇస్తుంది. దీనిలో కాల్స్‌ చేసుకోవడానికి మాత్రమే వీలుంటుంది. జనవరి 8 వరకూ ఈ కాంపిటీషన్‌ లో పాల్గొనేందుకు అప్లికేషన్‌ పెట్టుకోవచ్చు. అప్లికేషన్‌ అనగానే అదేదో పెద్ద పని అని కంగారుపడిపోకండి! జస్ట్‌‌‌‌ ఓ ట్వీట్‌ చేస్తే చాలు. విటమిన్‌ వాటర్‌ ను ఉద్దేశిస్తూ మీరెందుకు పోటీలో పాల్గొనాలో చెబుతూ ట్వీట్‌ ను రాయాలి. దానికి #Contest, #NoPhoneForAYear అని జోడించాలి. అంతే అప్లికేషన్‌ పూర్తయినట్లే. తమకు వచ్చిన ట్వీట్లలో కొన్నింటిని ఎంపిక చేసి జనవరి 22లోగా విటమిన్‌ వాటర్‌ సమాచారం ఇస్తుంది.

బేసిక్‌ ఫోన్‌ చేతికి అందిన నాటి నుంచి 365 రోజుల పాటు స్మార్ట్‌‌‌‌ఫోన్‌ను ముట్టుకోకూడదు. ఎవరూ చూడట్లేదు కదా! ఫోన్‌ను వాడేసి నేను వాడలేదని చెబుదాం అనుకుంటే బుక్కైపోతారు. ప్రైజ్‌ మనీని ఇచ్చే ముందు కంటెస్టెంట్లకు విటమిన్‌ వాటర్‌ లై డిటెక్టర్‌ టెస్టులు చేస్తుందట. ఇప్పటికే వేల మంది విటమిన్‌ వాటర్‌ కు ట్వీట్‌ చేసేశారు. తామెందుకు స్మార్ట్‌‌‌‌ఫోన్‌ను పక్కన పెట్టాలనుకుంటున్నారో వివరిస్తున్నారు. మీకూ ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలని అనుకుంటె చేసేయండి మరీ ట్వీట్.

Posted in Uncategorized

Latest Updates