ఒడిశాలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

ఒడిశాలోని నువాపడా జిల్లాలో బుధవారం (అక్టోబర్-17) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నౌపాడ-కరీయార్ ప్రధాన రహదారిపై సిల్దా గ్రామ సమీపంలో లారీ, బొలెరో వాహనం ఒకదాని కొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్‌ సహా 10 మంది అక్కడి కక్కడే చనిపోయారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్‌ జిల్లా కకరా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వీరంతా మంగళవారం కోమ్నాలోని వైష్ణవి దేవి మందిరానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Posted in Uncategorized

Latest Updates