ఒడిషాలో మరోసారి…కూతురు మృతదేహంతో 8కి.మీ నడిచాడు

కూతురు మృతదేహాన్ని వాహనంలో తరలించే స్తోమత లేక ఓ తండ్రి తన భుజంపైనే వేసుకుని 8 కిలోమీటర్లు నడిచాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఒడిషాలో జరిగింది.

తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా అతలాకులతమైన విసయం తెలిసిందే. ఈ సమయంలో ఈ నెల 11న ఒడిషాలోని గణపతి జిల్లాలోని అతంక్‌ పూర్ గ్రామానికి చెందిన బాబిత (7) కనిపించకుండా పోయింది. అప్పటినుంచి బాబిత  కోసం ఆమె తల్లిదండ్రులు గాలిస్తున్నారు. అయితే కొండచరియలు విరిగి పడిన ఘటనలో బాబిత  చనిపోయిందని గురువారం కుటుంబ సభ్యులకు గురువారం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం నిర్వహిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారం అందుతుందని పోలీసులు చెప్పి వెళ్లిపోయారు. జేబులో చిల్లి గవ్వా కూడా లేని ఆ నిరుపేద తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని ఓ సంచిలో వేసి భుజంపై పెట్టుకొని 8 కిలోమీటర్ల నడిచాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. ముకుంద్ నడుచుకుంటూ వస్తున్న దారిలో వచ్చి ఆయనకు సాయం చేసి ఆటోలో మృతదేహాన్ని తరలించారు. గజపతి జిల్లా కలెక్టర్ అనుపమ్ షా.. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల చెక్‌ ను అందజేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బిడ్డ మృతదేహాంతో తండ్రి ముకుంద్ 8 కిలోమీటర్ల నడవడం విచారకరమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు

Posted in Uncategorized

Latest Updates