ఒడిస్సాలో భారీ వర్షాలు : రైళ్ల రాకపోకలకు బ్రేక్

ఆంధ్ర, ఒడిశా బార్డర్ లోని రాయ్ ఘడ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పట్టాలపైకి మోకాలు లోతు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భువనేశ్వర్ నుంచి హీరాకుండ్ వెళ్తున్న హీరాకుండ్ ఎక్స్ ప్రెస్.. రాయ్ గఢ్ జిల్లా బాలుమస్కా స్టేషన్ దగ్గర వరద నీటిలో నిలిచిపోయింది. పట్టాలపై నుంచి మోకాలు లోతులో నీళ్లు ప్రవహిస్తుండటంతో.. ముందుజాగ్రత్తగా రైలుని నిలిపివేశారు. ఈ రూట్ లోని రాకపోకలు సాగించిన అన్ని రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాలు పడుతుండటంతో.. రైళ్ల రాకపోకలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు.

ఇక ఉత్తరాఖండ్ లోనూ వానలు బాగా పడుతున్నాయి. నడుము లోతు వరద నీటితో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. జనం ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. లోతట్టు ఏరియాల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. హరిద్వార్ లోని ఖర్కారీ ఏరియాలో వరద నీటిలో కారు కొట్టుకుపోయింది.

Posted in Uncategorized

Latest Updates