ఒత్తిడే శత్రువు : యాంకర్ తేజస్విని ఆత్మహత్య

anchor-tejasviఒత్తిడి.. మానసిక ఆందోళన మరో న్యూస్ యాంకర్ ప్రాణాలు తీసింది. కొన్నేళ్లుగా లోకల్ టీవీలో యాంకరింగ్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని ఉరేసుకుని చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ రాష్ట్రం విజయవాడలోని ఓ ప్రైవేట్ టీవీలో యాంకర్ గా పని చేస్తోంది తేజస్విని. ఈమెది గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన మట్టపల్లి తేజస్విని.. రెండేళ్ల క్రితం పవన్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలోనే రెండు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా.. పిల్లల కోరికను కాదనటం ఇష్టం లేక కుటుంబ సభ్యులే.. దగ్గరుండి పెళ్లి జరిపించారు. పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. తేజస్విని విజయవాడలోని ఓ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేస్తోంది.

పెళ్లి తర్వాత వీరు విజయవాడలోని ఈడుపుగల్లు MBMR కాలనీలోని ప్లాట్ నెంబర్ 105లో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది వయస్సు ఉన్న పాప ఉంది. పవన్ కుమార్ రెండు రోజుల క్రితం షిర్డి వెళ్లాడు. ఈ సమయంలో ఇంట్లోని అత్తతో తేజస్వినికి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకున్నది. ఎంత సేపటికీ తలుపులు తీయకపోవటం అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడగా ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. రెండేళ్లుగా ఎంతో మానసిక ఆందోళన, కుటుంబంలో వివాదాలతో విసిగిపోయి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తేజస్విని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు అయ్యింది. సీఐ శివాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates