ఒప్పందం కుదిరింది : డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్

KARNATAKA PRADESH CONGRESS COMMITTEE కర్ణాటకలో మంత్రి పదవులపై కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు కుమారస్వామి ఒకే చెప్పారు. 22 రెండు మంత్రి పదవులు కాంగ్రెస్ కు, 12 మంత్రి పదవులు జేడీఎస్ కు దక్కాయి. అసెంబ్లీ స్పీకర్ గా కాంగ్రెస్ అభ్యర్ధి ఉండనుండగా, డిప్యూటీ స్పీకర్ గా జేడీఎస్ అభ్యర్ధి ఉంటారు. బుధవారం(మే-23) సీఎంగా కుమారస్వామి, డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన తరువాతనే మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.

Posted in Uncategorized

Latest Updates