ఒరేయ్ నన్నుచూసి ఏడవకురా : పంటలకు దిష్టిబొమ్మగా సన్నిలియోన్

sunny-leone-poster-farmerపంట పొలాల దగ్గర దిష్టిబొమ్మలు పెడతాం.. నరుల చూపు పంటపై పడకుండా బొమ్మలు పెడతారు రైతులు. ఇది కామన్. ఇందుకు భిన్నంగా ఆలోచించారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రైతులు. దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల్లో రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ కూరగాయల సాగు చేపట్టారు. వందల ఎకరాల్లో సాగు చేసిన ఈ పంట బాగా వచ్చింది. చెట్లకు బెండ కాయలు నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. పెద్దపెద్ద క్యాబేజీలు, క్యాలీఫ్లవర్స్ అటుగా వెళ్లే వారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక వాహనాల్లో వెళ్లే వారు అయితే.. పంటలు బాగా పండాయి ఈసారి.. కాపు చూడండి ఎలా ఉందో అనుకుంటున్నారు. ఈ విషయం రైతులకు కూడా తెలిసింది. నరదిష్టి తగలకుండా.. అటుగా వెళ్లే వారి చూపు పంటపై పడకుండా.. చూపు మరల్చటానికి భిన్నంగా ఆలోచించారు.

ఆ వెంటనే.. పొలాల మధ్యలో పెద్ద పెద్ద సన్నిలియోన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒరేయ్ నన్ను చూసి ఏడవకురా అని స్లోగన్స్ రాశారు. దీంతో అటుగా వెళ్లే వారి చూపు అంతా ఇప్పుడు ఫ్లెక్సీలపై పడింది. పంటపై కాకుండా ఇప్పుడు ఈ ఫ్లెక్సీపై మాట్లాడుకుంటున్నారు. బండాకందిపల్లె గ్రామానికి చెందిన 45 ఏళ్ల చెంచురెడ్డి. సన్నీ బికినీ ఫొటో పెట్టిన తర్వాత ఎవరూ నా పంట వైపు చూడటం లేదంటున్నాడు ఆ రైతు. ఈయన బాటలో ఇప్పుడు మిగతా రైతులు అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. మొత్తానికి సన్నీలియోన్.. ఇప్పుడు దిష్టిబొమ్మగా కూడా మారిపోయింది. నరదిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అంటారు.. పంట ఓ లెక్కా అనే సామెత గుర్తుకుతెచ్చింది. ఎలాంటి చూపునైనా తన వైపు తిప్పుకుంటున్న సన్నీకి థ్యాంక్స్ చెప్పాల్సిందే..

Posted in Uncategorized

Latest Updates