ఒళ్లు జలదరిస్తుంది.. పాములు ఎలా పాకుతాయో తెలుసా..?

సాధారణంగా జరిగిపోయే కొన్ని అద్భుతాలను దగ్గరగా  గమనించి చూస్తే భలే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడుస్తుంది. పాము కదలికలకు కూడా ఈ కోవకు చెందినవే. మనుషులు, జంతువులు నడిచేందుకు.. పరుగెత్తేందుకు.. కాళ్లు పనికొస్తుంటాయి. కదిలే ప్రతి ప్రాణికి కదలడానికి ఏదో ఒక అవయవం దానికి సాయపడుతుంటుంది. మరి కాళ్లు లేని పాములు ఎలా పాకుతుంటాయి. కనుమూసి తెరిచేలాగో.. ఈ కొస నుంచి.. ఆ కొసకు చకచకా పాకిపోయే పాముల టాలెంట్ ను దగ్గరగా చూస్తే షాకైపోవాల్సిందే. వాటి చర్మంలోని కండరాలు.. వాటికి కదలడానికి.. పాకడానికి… పనికొస్తుంటాయన్న సంగతి చాలామందికి తెలుసు. పాము కదలికలు తెలియాలంటే.. పామును తాకాలి.. లేదా మెడలో వేసుకోవాలి.. అప్పుడు కానీ.. పాము ఎలా పాకుతుందో అర్థం కాదు. కానీ ఆ సాహసం అందరం చేయలేం. మేం ఈ వీడియో మాత్రం మీకు చూపించగలం. ఓసారి ఈ వీడియో చూడండి.. చర్మం పొలుసులుగా ఉండే కొన్ని పాములు ఇలా.. కండరాల సాయంతో.. ఒక్కో అంగుళం ముందుకు పాకుతుంటాయి. వాటి బాడీని అలా ముందుకు జరుపుతుంటాయి. నిజ్జంగా ఇది చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.

Posted in Uncategorized

Latest Updates