ఓం నమో వెంకటేశాయ :తిరుమల కొండపై పెరిగిన భక్తుల రద్దీ

tirతిరుమల  కొండ భక్తులతో  కిటకిటలాడుతోంది.  వేసవి సెలవులు  ముగుస్తుండడంతో  భక్తులు పెద్ద సంఖ్యలో  తిరుమలకు తరలివస్తున్నారు.  దీంతో  ఏడుకొండలు …భక్తజన  సంద్రంగా మారాయి.  సర్వదర్శనానికి  24 గంటలకు పైగా  సమయం పడుతోంది . దేశంలోని  పలు రాష్ట్రాల నుంచే  కాకుండా  విదేశాల నుంచి  కూడా  భక్తుల  తాకిడి పెరిగింది.  వసతి సదుపాయాలు  దొరక్క …భక్తులు ఇబ్బందులు  పడుతున్నారు. ఎండలు  కూడా తగ్గడంతో  తిరుమలకు  వచ్చే యాత్రికుల  సంఖ్య పెరిగింది.  మరో  రెండు  వారాలపాటు  భక్తుల  రద్దీ …ఇలాగే  ఉండే అవకాశం ఉందంటున్నారు  టీటీడీ అధికారులు.

Latest Updates