ఓటరు లిస్ట్ అవకతవకలపై విచారణ 31కి వాయిదా

హైకోర్టు : ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ మరోసారి హైకోర్టుముందుకు వచ్చింది. ఈ పిటిషన్ ను రెండు రోజుల కిందట విచారణ చేసిన హైకోర్టు…. అక్టోబర్ 12వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించొచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ కు కొన్ని సూచనలు చేసింది. న్యాయస్థానం కోరడంతో… బూత్ లెవల్ ఓటర్ల జాబితా అఫిడవిట్ ను కోర్టుకు దాఖలు చేసింది ఎన్నికల సంఘం. అఫిడవిట్ లో దాఖలు చేసిన ప్రకారమే…. ఓటరు జాబితా ఉండాలని కోర్టు ఆదేశిచింది. తుది జాబితా ప్రచురణకు పర్మిషన్ ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది.

Posted in Uncategorized

Latest Updates