ఓటర్ల లిస్ట్ సవరణే ప్రధాన ఎజెండ: మూడురోజులు KTR సమావేశాలు

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎన్నికైన తర్వాత పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు కేటీఆర్. ఈ క్రమంలోనే మూడురోజుల పాటు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 22 నుండి 24 వరకు నియోజకవర్గ సమావేశాలు నిర్వహించనుండగా ఓటర్ల జాబితా సవరణ ప్రధాన ఎజెండాగా ఆ సమావేశాలు ఉండనున్నాయి. ఓట్ల గల్లంతుతో పార్టీ అభ్యర్థులకు రావాల్సిన మెజార్టీలు కొంతవరకు తగ్గాయన్నారు. దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామని.. త్వరలో జరగబోతే విస్తృత సమావేశాలలో ఓటరు నమోదుపై కార్యకర్తలకు పలు మార్గదర్శకాలు చేయనున్నామన్నారు. కొన్నిచోట్ల ఓటర్ కార్డులు ఉండి కూడా ప్రజలు ఓట్లు వేయలేకపోయారన్న కేటీఆర్… డిసెంబర్ 26 నుంచి జనవరి 6వరకు ఓటరు నమోదులో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు. పార్లమెంట్, పంచాయతీ ఎన్నికలపై నేతలతో చర్చించారు. నియోజకవర్గాల ఇంచార్జీలకు బాధ్యతల అప్పగింతపై డిస్కస్ చేశారు.

జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపైనా సమావేశంలో చర్చించారు కేటీఆర్. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థల సేకరణ జరిగిందని, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ భవనాల నమూనాను ఆమోదించిన తర్వాత.. నిర్మాణాలు మొదలుపెడతామన్నారు. జనవరి మొదటి వారం నుంచి.. పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు కేటీఆర్.

ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారిగా సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళుతున్నారు కేటీఆర్. రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు తంగళ్లపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో పద్మనాయక కళ్యాణ మండపం దగ్గరికి వెళ్లి  అక్కడే పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ ను కలిసి.. అభినందనలు తెలిపారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates