ఓటింగ్ కష్టమే : అవిశ్వాసంపై టీఆర్ఎస్ స్టాండ్ ఇదే

శుక్రవారం(జూలై-20) పార్లమెంట్ లో అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందని అనుకోవడంలేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్. ఏపీకి కేంద్రం 90శాతం నిధులిస్తే అభ్యంతరం లేదన్న వినోద్.. అక్కడి పరిశ్రమలకు ఇన్సెంటివ్ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తామన్నారు. ఏపీకి ఎలాంటి ప్రత్యేక హోదా ఇస్తారన్న విషయంపై రాహుల్ ను ప్రశ్నిస్తామన్నారు వినోద్. ఫస్ట్ కెబినేట్ మీటింగ్ లోనే తెలంగాణకు అన్యాయం చేశారన్నారు ఎంపీ వినోద్. హైకోర్టు విభజన ఎందుకు చేయటం లేదని కేంద్రాన్ని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్ కింద ఏడు మండలాలను అన్యాయంగా తీసేసుకున్నారన్నారని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates