ఓటుకు నోటు కేసు : అప్రూవర్ గా మత్తయ్య

cash-for-vote-jerusalem-mathaiahఅఫ్రూవర్ గా మారేందుకు తనకు అవకాశమివ్వాలని కోరారు జెరూసలెం మత్తయ్య. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ4గా నిందితుడు గా ఉన్న జెరూసలెం మత్తయ్య అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. రెండు ప్రభుత్వాలు నుంచి తనపై వత్తిడులు వస్తున్నాయని, ఓటుకు నోటు కేసుతో  అసలు తనకు సంబంధం లేదని, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ని క్రిస్టియన్ సమస్యల మీద చర్చించేందుకే కలిశానని ఆ లేఖలో తెలిపాడు. తనకు తెలిసిన విషయం మొత్తం కోర్టుకు చెబుతానని, ఓటుకు నోటు కేసుతో పాటు ఇందుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరాడు మత్తయ్య.
Cash-for-Vote-Scam
Cash-for-Vote-Scam-1

Posted in Uncategorized

Latest Updates