ఓటువేసి సెల్ఫీదిగిన వ్యక్తి అరెస్ట్

ఒకప్పుడు పిచ్చి పలు రకాలు అనేవారు.. ఇప్పుడు సెల్ఫీ పిచ్చి పలు రకాలు అనాల్సి వస్తుంది. రాజ్యాంగం దేశంలోని పౌరులందరికి ఇచ్చిన గొప్ప హక్కు ఓటు. ప్రతీ 5 సంవత్సరాలకు ఒక సారి ఓటు హక్కును వినియోగించుకుంటాం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో ఓ వ్యక్తి బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్‌లో ఒక ఓటర్.. ఓటువేసిన తర్వాత పోలింగ్ బూత్ లో సెల్ఫీ దిగాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఐపీసీ సెక్ష‌న్ 188 కింద కేసును నమోదు చేశారు. సెల్ఫీ దిగిన ఓట‌రును శివ శంక‌ర్‌గా గుర్తించారు. ఎన్నిక‌ల ఆఫీస‌ర్ ఫిర్యాదు చేయడంతో.. కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates