ఓటు వేసిన గవర్నర్ దంపతులు

హైదరాబాద్ సోమాజిగూడలోని ఎంఎస్ మక్తలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ దంపతులు రాజ్ భవన్ నుంచి సోమాజిగూడలోని ఎంఎస్ మక్తా చేరుకొని అక్కడి పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లెలో ఆయన ఓటు వేశారు.  హైదరాబాద్ లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ లు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు.

Posted in Uncategorized

Latest Updates