ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ తర్వాత ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ సెంటర్లకు చేరుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ముందుగానే చేరుకుని పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు.

కరీంనగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎంపీ వినోద్. ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన అందరితో క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు దంపతులు సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా… హరీశ్ రావు దంపతులు సిద్దిపేటలోని పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే వారు పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకుని ఓటేశారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని ఎల్లపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని కొనాయిపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఎంపీ గుత్తా, భాస్కర్ రావులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

GHMC కమిషనర్‌ దాన కిషోర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బేగంపేటలో పోలింగ్‌ కేంద్రంలో దాన కిషోర్‌ ఓటు వేశారు. బేగంపేటలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఓటు వేశారు. మహబూబ్ నగర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates