ఓటేసిన వారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అది వారి హక్కు

రాష్ట్రంలో విద్యావిధానం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. బోధనా సిబ్బందిలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూనివర్సిటీల్లో వీసీలను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు. ఓటు వేసిన వారు ప్రభుత్వాన్ని నిలదీస్తారని, అది వారి హక్కు అని ఆమె అన్నారు. విద్యార్థులపై దాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం మద్యంపై పెట్టిన శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ పై పెట్టడం లేదన్నారు సీతక్క.

Latest Updates