ఓటేస్తూ ఫోన్ లో వీడియో రికార్డ్.. కాంగ్రెస్ నేతపై నాన్ బెయిలబుల్ కేసు

పోలింగ్ స్టేషన్ కు సెల్ ఫోన్ తీసుకురావడమే నిషేధం. సెల్ ఫోన్ తీసుకొచ్చిన వారు చాలామంది ఓటర్లను ఎన్నికల సిబ్బంది, పోలీసులు… పోలింగ్ స్టేషన్ నుంచి తిప్పి పంపిన సంఘటనలు రాష్ట్రమంతటా జరిగాయి. ఐతే.. ఓ నాయకుడు మాత్రం సెల్ ఫోన్ ను తీసుకురావడమే కాదు… తాను వేసిన ఓటును… వీవీ ప్యాట్ లో వచ్చిన స్లిప్ ను వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. చివరకు అరెస్టయ్యాడు.

ఈ సంఘటన హైదరాబాద్ – ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ లో జరిగింది. ఓటు వేస్తూ వీడియో రికార్డ్ చేశాడు నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ చంద్రశేఖర్ ఆజాద్. అదేరోజు దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో.. పోలీసులు తీవ్రమైన నేరంగా పరిగణించారు. IPC సెక్షన్లు 188,128 RP Act కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రిటర్నింగ్ అధికారి ముకుంద రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు ఎల్బీనగర్ పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates