ఓట్ల కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదు

kcrతెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టే సమయానికి చెల్లింపులు చేయగలుగుతున్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ఓట్లు పొందాలని చూడడం సరికాదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అవగాహనతో మాట్లాడాలన్నారు. ప్రతిపక్షాలు అజ్ఞానంతో విమర్శలు చేస్తున్నాయన్నారు. ద్రవ్య వినిమయం విషయంలో గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఎలా ఉంటుందో… మనం కూడా అలాగే ఉండాల్సి వస్తుందన్నారు. కేంద్రానికి రాష్ట్రాల మధ్య ఎన్నో సర్దుబాట్లు జరుగుతుంటాయన్నారు. అనుకోకుండా కరువు వస్తే ఎక్కడ నుంచి తేవాలన్నారు.  ఏ ప్రభుత్వమూ నష్టపరిహారం ఇవ్వదన్నారు.

దేశాన్ని సాదే ఏడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అన్నారు. కేంద్రం దయతలిచి రాష్ట్రాలకు ఇచ్చేదంటూ ఏమీ ఉండదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటాలో హక్కుందన్నారు. కేంద్రానికి మన రాష్ట్రం నుంచి రూ.50వేల కోట్లు వెళ్తున్నాయన్నారు. కేంద్రం నుంచి మనకు రూ.24వేల కోట్లే వస్తున్నాయని తెలిపారు. ఇది నా కవిత్వం కాదని..లెక్కలున్నాయన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates