ఓడిపోతే ఇటలీ వెళ్లిపోతావా… రాహుల్ కు సాక్షి సవాల్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి బీజేపీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో రాహుల్ తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. సాధారణ ఎన్నికల్లో యూపీలోని ఉన్నావో నుంచి తనపై పోటీ చేయాలన్నారు. ఎన్నికల్లో రాహుల్ విజయం సాధించి… తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన్నారు. అయితే రాహుల్ ఓడిపోతే ఆయన ఇండియా విడిచిపెట్టి ఇటలీ వెళ్లిపోతావా అని సవాల్ విసిరారు.

రాహుల్ గాంధీ గత సెప్టెంబర్‌లో మానస సరోవర్ యాత్ర చేయడంపై కూడా సాక్షి మహరాజ్ విమర్శించారు.అది పవిత్రత లేకుండా చేసిన యాత్ర అన్నారు. యాత్రకు ముందు ఆయన పరిశుద్ధంగా ఉండాలని.. నిష్ట లేకుండా ఎవరూ ఆలయంలోకి వెళ్లకూడదన్నారు. మాంసాహారం తిని దర్శనానికి వెళ్లడాన్ని ఎవరూ సమర్ధించరంటూ రాహుల్‌పై ఆయన ఆరోపణలు గుప్పించారు సాక్షి మహరాజ్.

Posted in Uncategorized

Latest Updates