ఓపికే ఉండటం లేదు : ఫోన్ డెలివరీ ఆలస్యంతో కత్తులతో పొడిచారు

PHONE

అస్సలు ఓపిక ఉండటం లేదు.. సహనం అంటే ఏంటో కూడా తెలియటం లేదు. ఇక ఇష్టమైన ఫోన్ డెలివరీ టైంకి రాకపోతే.. ఒకటికి పదిసార్లు ఫోన్లు చేయటం. మరీ టూమచ్ గా ఉన్నా.. ఇలాంటి ఘటన ఒకటి కలకలం రేపుతోంది. ఆన్ లైన్ లో సెల్ ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి.. డెలివరీ లేట్ అయినందుకు కొరియర్ బాయ్ పై కత్తితో దాడి చేశాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 20 పోట్లు పొడిచాడు. ఇందుకు ఆ యువకుడి చెల్లెలు కూడా సహకరించటం చిత్రం. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని నిహాల్ విహార్ కు చెందిన కమల్ దీప్ (30), జితేందర్ సింగ్(32) అన్నాచెల్లెల్లు. కొన్ని రోజుల క్రితం ఫ్లిఫ్ కార్డులో  సెల్ ఫోన్ ఆర్డర్ చేశారు. డెలివరీలో ఆలస్యం అయ్యింది. కారణం ఏంటని డెలివరీ బాయ్ కేశవ్ కుమార్ సింగ్(21)కు వరుసగా ఫోన్లు చేశారు. చివరికి వాళ్ల ఇంటికి డెలివరీ చేయడానికి వెళ్లాడు కుమార్ సింగ్. అప్పటికే పీకలదాక కోపంతో ఊగిపోతున్న కమల్ దీప డెలివరీ బాయ్ తో గొడవకి దాగాడు. అంతటితో ఆగకుండా అన్న కేశవ్ కుమార్ సింగ్ తో కలిసి కత్తితో దాడి చేసింది. 20 నిమిషాలు అన్నాచెల్లెల్లు డెలివరీ బాయ్ కేశవ్ కుమార్ సింగ్‌ ను తీవ్రంగా హింసించారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడు చనిపోయాడని భావించి ఇంటి పక్కన ఉన్న డ్రైనేజీలో పడేశారు. సింగ్‌ను గుర్తించిన ఓ వ్యక్తి..  పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. కమల్ దీప్, జితేందర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని నిహాల్ విహార్‌ లో మార్చి 21వ తేదీన ఈ ఘటన జరిగింది.

 

Posted in Uncategorized

Latest Updates