ఓపెన్ సేల్ లో రెడ్ మీ-5 స్మార్ట్ ఫోన్

redmi5చైనాలో తయారవుతున్న షియోమీ రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు ఓపెన్ సేల్‌లో విక్రయిస్తున్నారు. ఆరంభంలో దీన్ని కేవలం అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో మాత్రమే ఫ్లాష్ సేల్‌లో విక్రయించారు. కానీ ప్రస్తుతం అవే స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను వినియోగదారులు ఓపెన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ 5కు చెందిన 2/3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లు మూడు అన్ని కలర్స్‌లో ఇప్పుడు ఆయా ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తున్నాయి. వీటిని వరుసగా రూ.7,999, రూ.8,999, రూ.10,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి.

రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్‌ను కొన్నవారికి పలు ఆఫర్లను కూడా అందజేస్తున్నారు. ఈ ఫోన్‌ను కొంటే కిండిల్ ఈ-బుక్స్‌పై 90 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి డివైస్‌ను కొనుగోలు చేస్తే రూ.500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందజేస్తారు. దీంతోపాటు ఈ ఫోన్ కొనుగోలుపై జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. ఇక రెడ్‌మీ 5 ఫోన్‌లో 5.7 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 12, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates