ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్: ఎస్సెస్సీ, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు స్పెషల్ అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు  తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు. ఇవాల్టీ(శనివారం) నుంచి ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు విధించినట్లు తెలిపారాయన. మధ్యలో బడి మానేసినవారు, దూర విద్యావిధానం ద్వారా చదువుకోవాలనుకొనేవారికి ఈ విధానంలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు వెంకటేశ్వర్లు. మీసేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపాలని సూచించారు డైరెక్టర్ వెంకటేశ్వర్లు.

Posted in Uncategorized

Latest Updates