ఓయూలో అగ్ని ప్రమాదం : డిగ్రీ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు

OU STUDENTS RE EXAMSహైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ విభాగంలో మంగళవారం (జూన్-12) ఉదయం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే… ప్రమాదం జరిగిందని తెలిపారు అగ్నిమాప సిబ్బంది.  ఫైర్ యాక్సిడెంట్ కారణంగా.. పలు పరీక్ష పేపర్లు కాలిపోయినటనట్లు తెలిపారు  అధికారులు.

అగ్నిప్రమాదంపై నివేదిక సమర్పించింది కమిటి. దగ్ధమైన సమాధాన పత్రాలకు సంబంధించిన పరీక్షలను తిరిగి నిర్వహించాలని సిఫారసు చేసింది. BSC 2, 4 రెగ్యులర్, 1, 3 సప్లిమెంటరీ సమాధాన పత్రాలు దగ్ధమైనట్లు తేల్చిన కమిటి.. జూన్ చివరి వారంలో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని వెల్లడించింది.  1, 3వ సెమిస్టర్ జంతుశాస్త్రం, గణితం సమాధాన పత్రాలు.. 2, 4వ సెమిస్టర్ జంతు, వృక్ష, భౌతిక శాస్ర్తాలు, గణితం సమాధాన పత్రాలు దగ్ధమైనట్లు వెల్లడించింది కమిటీ. పరీక్షలు ఎప్పుడన్న తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates